Share News

Siddaramaiah - KTR :కేటీఆర్ ట్వీట్‌కి సీఎం సిద్దరామయ్య కౌంటర్

ABN , Publish Date - Dec 19 , 2023 | 06:07 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) అసెంబ్లీలో మాట్లాడారంటూ వైరలవుతున్న ఓ వీడియోను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) రీపోస్టు చేస్తూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ట్వీట్‌పై తాజాగా సిద్దరామయ్య స్పందించారు. అది ఫేక్‌ వీడియో అని కొట్టిపారేస్తూ.. కేటీఆర్‌కు ఘాటుగా సిద్దరామయ్య బదులిచారు.

Siddaramaiah - KTR :కేటీఆర్ ట్వీట్‌కి సీఎం సిద్దరామయ్య కౌంటర్

హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) అసెంబ్లీలో మాట్లాడారంటూ వైరలవుతున్న ఓ వీడియోను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) రీపోస్టు చేస్తూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ట్వీట్‌పై తాజాగా సిద్దరామయ్య స్పందించారు. అది ఫేక్‌ వీడియో అని కొట్టిపారేస్తూ.. కేటీఆర్‌కు ఘాటుగా సిద్దరామయ్య బదులిచారు.

‘‘ఫేక్ వీడియోలతో కేటీఆర్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోంటే మీరు వాటిని ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి మీ పార్టీ బీ టీంగా పనిచేస్తోంది. ఎన్నికలకు ముందు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫేక్ లెటర్‌తో ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల హామీలకు డబ్బుల్లేవన్నట్లు తన ఫేక్ వీడియోపై 2 రోజుల క్రితమే వివరణ ఇచ్చాను. మీకు ఫేక్ వీడియోకు అసలు వీడియోకు తేడా తెలియదు. తెలంగాణ ఎన్నికలల్లో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా..?! ఏది ఫేక్, ఏది ఎడిట్, ఏది నిజమో మీకు తెలియదు. బీజేపీ నకిలీ, ఎడిట్ చేసిన వీడియోలను సృష్టిస్తోంది. మీరు వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు. నిజాలు తెలుసుకోనందుకే తెలంగాణలో మీరు ఓడారు’’ అని కర్నాటక సీఎం సిద్దరామయ్య ఎద్దేవా చేశారు.

కాగా... ‘‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు’’ అని సిద్దరామయ్య (Siddaramaiah) అసెంబ్లీలో మాట్లాడారంటూ ఆ వీడియో ప్రచారంలో ఉంది.

కేటీఆర్‌పై కాంగ్రెస్ సోషల్ మీడియా ఆగ్రహం

కేటీఆర్‌పై ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కౌంటర్ ఇచ్చింది. ‘‘కేటీఆర్ బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడే ప్రవళిక గ్రూప్స్‌కు దరఖాస్తే చేయలేదని ఫేక్ స్టేట్ మెంట్ ఇచ్చారు కర్నాటక డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ ఫాక్స్‌కాన్‌ను తరలించుకుపోతున్నారని ఫేక్ లెటర్ X లో పెట్టాడు. ఇప్పుడు కర్నాటక సీఎం సిద్ధ రామయ్య పేరుతో ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. ఫేక్ ప్రచారాలే మీ బతుకుతెరువని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి ఫాంహౌస్‌లో కూర్చోబెట్టారు..ఇంకా మీరు మారరా’’ అని కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - Dec 19 , 2023 | 07:47 PM