KTR: మంత్రి కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-10-11T14:28:37+05:30 IST

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చార్జెడ్ అకౌంటెంట్, కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాల్సిందిగా కేటీఆర్ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

KTR: మంత్రి కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

న్యూఢిల్లీ: మంత్రి కేటీఆర్ (Minister KTR) వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) చార్జెడ్ అకౌంటెంట్, కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి (Congress Leader Venugopala Swamy) ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాల్సిందిగా కేటీఆర్ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత లేఖ రాశారు. ఏ పార్టీ నుంచి డబ్బు తీసుకున్నా సరే.. ఓటు మాత్రం బీఆర్ఎస్‌కు (BRS) వేయాలని సూచిస్తున్నారని వెల్లడించారు. కేటీఆర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వేణుగోపాల స్వామి వినతి చేశారు. మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానంటూ వేణుగోపాల స్వామి లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-10-11T14:28:37+05:30 IST