Congress: హైదరాబాద్‌ వేదికగా రసవత్తర రాజకీయం

ABN , First Publish Date - 2023-08-31T18:49:03+05:30 IST

హైదరాబాద్‌( Hyderabad)లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ(BRS, BJP) పార్టీలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ రసవత్తర రాజకీయం చేయబోతోంది.

 Congress: హైదరాబాద్‌ వేదికగా రసవత్తర రాజకీయం

హైదరాబాద్‌: హైదరాబాద్‌( Hyderabad)లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ(BRS, BJP) పార్టీలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ రసవత్తర రాజకీయం చేయబోతోంది. తెలంగాణలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా CWC తొలిసారి హైదరాబాద్‌లో భేటీ కాబోతోంది. సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లో CWC సమావేశం(CWC Meeting) నిర్వహించాలని ఏఐసీసీ ఆలోచన చేస్తోంది. కాగ్రెస్(Congress) అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గేతో పాటు CWC సభ్యులంతా హైదరాబాద్‌లో సమావేశాలకు తరలి రానున్నారు. సెప్టెంబర్ 18వ తేదీన ‘‘ఎన్నికల శంఖారావం’’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికలు(Telangana elections) టార్గెట్‌గా కార్యక్రమాలను రూపొందించనున్నారు. కాగా అనుకోకుండా వచ్చిన పార్లమెంట్ సమావేశాలతో CWC సమావేశాల తేదీలు మారే అవకాశాలు ఉన్నాయి. కానీ పక్కాగా హైదరాబాద్‌లోనే ఈ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే హస్తం పార్టీ మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ గట్టిపోటీనిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ప్రత్యర్థిగా మారి రాష్ట్రంలో ఇటు బీఆర్‌ఎస్‌కు.. అటు కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టేలా కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతోంది. కేంద్రంలో హవాను చూపించాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోదీలను ఢీకొట్టేలా కాంగ్రెస్ అధిష్ఠానం పథకం రచిస్తోంది.

Updated Date - 2023-08-31T19:11:24+05:30 IST