TS NEWS: మంత్రి అజయ్‌కు మతి లేదు..: రామారావు

ABN , First Publish Date - 2023-08-24T16:18:35+05:30 IST

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌(Minister Puvwada Ajay Kumar)కి మంత్రికి మతి లేదు.. పర్సంటేజ్ పెట్టుకుని పని చేస్తున్నారు.. పని చేసిన వారిని మరిచి మతిలేని వారికి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని కమ్మ ఐక్య వేదిక నేత రామారావు(Kamma Union leader Rama Rao) ఎద్దేవ చేశారు.

TS NEWS: మంత్రి అజయ్‌కు మతి లేదు..: రామారావు

ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌(Minister Puvwada Ajay Kumar)కి మంత్రికి మతి లేదు.. పర్సంటేజ్ పెట్టుకుని పని చేస్తున్నారు.. పని చేసిన వారిని మరిచి మతిలేని వారికి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని కమ్మ ఐక్య వేదిక నేత రామారావు(Kamma Union leader Rama Rao) ఎద్దేవ చేశారు. గురువారం నాడు ఖమ్మం(Khammam) వేదికగా ఆయన ఈ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కమ్మ వారిని పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయి. కమ్మ వారిని రాజకీయంగా తొక్కేస్తున్నారు. కమ్మ వారి సహకారంతో కేసీఆర్ సీఎం అయ్యారు.తెలంగాణలో ఎవరు దిక్కు లేనప్పుడు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అండగా నిలిచారు. తుమ్మలని వాడుకుని వదిలేయడం కేసీఆర్‌కు అలవాటు.సీఎంను అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదు. కేసీఆర్ నవాబును మించి పోయారు. కమ్మ వారిని దూరం పెట్టిన ఘనత కేసిఆర్‌ది. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన ఐదు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సొంతంగా ఎదిగిన వారే. కేసీఆర్‌కు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం. కోదాడ, హుజురాబాద్‌లో మా సంఖ్య ఎక్కువ. అక్కడ మా సామాజిక వర్గం అన్యాయానికి గురి అవుతోంది.వచ్చే నెలలో కమ్మ గర్జన నిర్వహిస్తాం’’ అని సీఎం కేసీఆర్‌(CM KCR)ని కమ్మ ఐక్య వేదిక నేత రామారావు హెచ్చరించారు.

కమ్మ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారు: విద్యా సాగర్

అన్ని పార్టీలు కమ్మ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కమ్మ రాజకీయ ఐక్య వేదిక నేత విద్యా సాగర్ డిమాండ్ చేశారు.‘‘30నుంచి 40నియోజక వర్గాలల్లో మేము ప్రభావితం చేస్తాం. కొన్ని పార్టీలు మా సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశాయి.మేం ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. ఐదు స్థానాల్లో అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్‌కు ధన్యవాదాలు.కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఒక్క కమ్మ వారికి కూడా టికెట్ ఇవ్వలేదు. ఈ సారి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. కమ్మ వారికి పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి’’ అని విద్యా సాగర్ కోరారు.

Updated Date - 2023-08-24T16:18:35+05:30 IST