Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారిని.. గవర్నర్ కోటకు ఎలా నామినేట్ చేస్తారు

ABN , First Publish Date - 2023-09-25T18:50:51+05:30 IST

బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt)గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు.

Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారిని.. గవర్నర్ కోటకు ఎలా నామినేట్ చేస్తారు

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt)గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని కిషన్‌రెడ్డి సమర్థించారు.సోమవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘గవర్నర్ కోట అంటే రాజకీయ నేతలకు ఎమ్మెల్సీ(MLC)లు ఇవ్వడం కాదు..నాన్ పొలిటికల్‌కు ఎలా ఇస్తారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ(MLC)ల సిఫార్సులను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్(Governor Tamil Sai Soundararajan) తిరస్కరించడాన్ని స్వాగతించారు. మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రజాసేవ చేసే వారికి మాత్రమే గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీ(MLC)లు ఇస్తారు. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారికి ఈ పోస్టుకు ఎలా నామినేట్ చేస్తారు..?. గవర్నర్ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-25T18:50:51+05:30 IST