Kishan Reddy: మేడారంలో మొక్కులు తీర్చుకున్న కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-10-11T15:31:14+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) ములుగుకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చినందుకుగానూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) మేడారంలోని సమక్క సారక్క అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు.

Kishan Reddy: మేడారంలో మొక్కులు తీర్చుకున్న కిషన్‌రెడ్డి

వరంగల్(ములుగు): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) ములుగుకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చినందుకుగానూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) మేడారంలోని సమక్క సారక్క అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘గిరిజన ఆరాధ్య దేవతలు సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులు తెలంగాణకు, దేశ ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను. ములుగులో గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఇవ్వడం మాములు విషయం కాదు. అమ్మవార్ల ఆశీస్సులు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉండాలి. ప్రాచిన దేవాలయం రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం గొప్ప విషయం. హైదరాబాద్‌లో గిరిజనుల జీవన విధానాలను కళ్లకు కట్టినట్టు చూపించే విధంగా ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం. ట్రైబల్ సర్క్యూట్ పేరుతో టూరిజం మినిస్ట్రీ ద్యారా పర్యాటక ప్రాంతాలైన రామప్ప, లక్నవరం, మేడారం, బొగత జలపాతం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వంటి ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్ 10% అమలు చేస్తాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-11T15:31:14+05:30 IST