Komati Reddy: కాంగ్రెస్‌లో చేరికల నేపథ్యంలో ఏబీఎన్‌తో కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-22T13:44:42+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చే వారి పేర్లు చెప్పనని... అందర్నీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Komati Reddy:  కాంగ్రెస్‌లో చేరికల నేపథ్యంలో ఏబీఎన్‌తో కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) చేరికల నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy Venkatreddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చే వారి పేర్లు చెప్పనని... అందర్నీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) మాట్లాడుతూ... రాష్ట్రంలో సంబరాలు చేసుకునే హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి (KCR Government) లేదన్నారు. సిద్దిపేట, సిరిసిల్లా, గజ్వేల్‌కే కేసీఆర్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళకి కేసీఆర్ పదవులు ఇచ్చారన్నారు. తెలంగాణ అంటే ఫుట్‌బాల్ ఆడినవాళ్ళని, కట్టెలు పట్టుకుని కొట్టిన వాళ్ళకి కేసీఆర్ పదవులు ఇస్తున్నారని విమర్శించారు. ఐదేండ్ల నుంచి శంకరమ్మకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఎంపీ అన్నారు.

బీజేపీ నేత బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) మాటలకు బీజేపీ నేతలు కూడా నవ్వుతున్నారన్నారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా బీజేపీనీ ఏం అనడం లేదని.. కాంగ్రెస్‌ను మాత్రం తిడుతున్నారన్నారు. అధికారంలో లేని కాంగ్రెస్‌‌ను కేసీఆర్ ఎందుకు తిడుతున్నారని మండిపడ్డారు. కవిత అరెస్ట్ అని బండి సంజయ్ అన్నారని.. ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ - బీఆర్ఎస్ ఒక్కటే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వస్తారని.. అలాగే మహబూబ్‌నగర్ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. ఈవీఏం మిషన్లు వచ్చేశాయని.. వాటిని టాంపరింగ్ కాకుండా చూసుకోవాలన్నారు. ఈసారి ఈవీఏం మిషన్లు బీహెచ్‌ఈఎల్ నుంచి రావడం లేదని.. జాగ్రత్తగా ఉండాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.

Updated Date - 2023-06-22T13:45:46+05:30 IST