KTR: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై కేటీఆర్ ఆగ్రహం
ABN , First Publish Date - 2023-11-04T15:38:35+05:30 IST
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై (Karnataka Deputy CM DK Shivakumar) మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరుకు మార్చాలని గత నెలలో ఫాక్స్‌కాన్ కంపెనీకి (Foxconn Company) కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేఖ రాశారని మంత్రి మండిపడ్డారు. ‘‘ఎంతో కష్టపడి ఈ కంపెనీని మనం తీసుకొచ్చాం. ఫాక్స్ కాన్ సీఈఓ కూడా ఇక్కడ కంపెనీ పెట్టీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కంపెనీ ప్రారంభానికి కొద్ది రోజుల సమయం ఉంది. కానీ డీకే శివకుమార్ ఫాక్స్ కాన్ సీఈఓకి లేఖ రాసి ఈ కంపెనీ బెంగుళూరుకు మార్చాలని కోరారు. సరే ఆశ పడుతున్నాడు అనుకోవచ్చు. కానీ ఇంకా కొన్ని కామెంట్స్ చేశాడు. త్వరలో తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుంది. అక్కడ ఉన్న ప్రముఖ కంపినీలన్నీ మార్చేస్తాం అని రాశారు. ఇది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నం. కేసీఆర్ లేకపోయినా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకపోతే జరిగేది ఇది. ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ కంపెనీలన్ని తీసుకెళ్తారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలకు బెంగుళూరుకు అడ్డాగా మారింది. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ వచ్చే ఉద్యోగాలు కూడా బెంగుళూరుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా నీ నీతి’’ అంటూ డీకే శివకుమార్‌పై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.