Share News

Minister KTR: దివ్యాంగుల పింఛన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-19T14:46:19+05:30 IST

హైదరాబాద్: దివ్యాంగుల పింఛన్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరుగుతున్న దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు రూ. 2 వందల పింఛన్ ఇస్తుందని.. అదే తెలంగాణలో రూ. 4,016 ఇస్తున్నామని చెప్పారు.

Minister KTR: దివ్యాంగుల పింఛన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: దివ్యాంగుల పింఛన్‌ (Disability Pension)పై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో జరుగుతున్న దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) దివ్యాంగులకు రూ. 2 వందల పింఛన్ ఇస్తుందని.. అదే తెలంగాణ (Telangana)లో రూ. 4,016 ఇస్తున్నామని చెప్పారు. అంటే 20 రెట్లు ఎక్కువన్నారు. ఇక్కడ అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ. 4వేలు ఇస్తామంటే.. పక్కనున్న ఛత్తీస్‌గఢ్‌లో ఇవ్వకుండా తెలంగాణ రూ. 4వేలు ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarath) అని.. అక్కడ మరీ దారుణమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. చిన్న రాష్ట్రం తెలంగాణలో 5,69,712 మంది దివ్యాంగులు ఉన్నారని గుర్తించామని, పెద్ద రాష్ట్రమైన గుజరాత్‌లో దివ్యాంగుల సంఖ్య 47,034 మంది మాత్రమే. మరి దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలన్నారు. అక్కడ కనీసం అంగవైఖల్యాన్ని కూడా గుర్తించకుండా.. ఇంత దారుణంగా ఉందని విమర్శించారు. వారికి పింఛన్ ఎంత ఇస్తున్నారంటే.. అది కూడా అంగవైకల్యంబట్టి.. రూ. 6 వందల నుంచి వెయ్యి ఇస్తున్నారన్నారు. ఇక కర్నాట (Karnataka) రాష్ట్రంలో 8,000,30 మంది దివ్యాంగులకు పింఛన్ ఇస్తున్నారన్నారు. అక్కడ ఇచ్చే పింఛన్ రూ. 11 వందలు మాత్రమే. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయమని, చీకటి పాలనకు చిరునామా కర్నాటక అని మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విభజన హామీలపై ఎన్డీయేను ప్రశ్నించని రాహుల్‌కు.. తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. కర్నాటకలో హామీలన్ని 100 రోజుల్లోనే బొంద పెట్టారన్నారు. అక్కడి రైతులకు 5 గంటలు కూడా కరెంట్‌ ఇవ్వడం లేదని, తెలంగాణకు నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. ల్యాండ్‌ మాఫియాకు కేరాఫ్‌ టీపీసీసీ చీఫ్‌ అని, టిక్కెట్ల కోసం రూ. కోట్ల సొమ్ముతో పాటు.. భూములు రాయించుకుంటున్న రాబందు రేవంత్‌రెడ్డి అని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పటికి నమ్మరని మంత్రి కేటీఆర్ అన్నారు.

Updated Date - 2023-10-19T14:46:19+05:30 IST