Malla Reddy: ఎంపీ ప్రభాకర్ రెడ్డికి అందుతున్న వైద్యంపై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-30T19:20:38+05:30 IST
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రభాకర్ రెడ్డిని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆ స్పత్రిలో ప్రభాకర్ రెడ్డికి అందుతున్న వైద్యంపై మంత్రి మల్లారెడ్డి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి ( MP Prabhakar Reddy) కి అందుతున్న వైద్యంపై మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రభాకర్ రెడ్డి పేగుకు హోల్ పడింది. ఆయనకు డాక్టర్లు ఓపెన్ సర్జరీ చేస్తున్నారు. ప్రతిపక్షాలు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాయి. రేవంత్ రెడ్డి రౌడీలకు గూండాలకు టికెట్లు ఇచ్చారు. వాళ్లు ప్రజల మీద పడి అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. వారి ఆటలు మా సీఎం సాగనివ్వరు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు నా అంతు చూస్తానని బెదిరిస్తున్నారు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.