Share News

Minister Komati Reddy: జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలి

ABN , First Publish Date - 2023-12-11T21:41:39+05:30 IST

జాతీయరహదారులకు నిధులు కేటాయించాలని కోరానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Minister Komati Reddy Venkata Reddy ) అన్నారు. సోమవారం నాడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు.

Minister Komati Reddy: జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలి

ఢిల్లీ: జాతీయరహదారులకు నిధులు కేటాయించాలని కోరానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Minister Komati Reddy Venkata Reddy ) అన్నారు. సోమవారం నాడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలంగాణలో రోడ్ల విస్తరణ, పెండింగ్ అంశాలపై సమావేశంలో చర్చించాం. తెలంగాణలో రహదారులపై పలు ప్రతిపాదనలు సమర్పించాను. 14 రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్‌లుగా మార్చాలని కోరాం. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి వీలైనంత ఎక్కువగా కేంద్ర నిధులు సాధిస్తా. గత ఐదేళ్లలో తెలంగాణలో రహదారులు చాలా దెబ్బతిన్నాయి. రోడ్లకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించా. జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. మార్చిలో భవన్‌కు శంకుస్థాపన చేస్తాం. మేము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడం. గత ప్రభుత్వ మంచి, చెడులపై కేబినెట్‌లో చర్చిస్తాం. గత ప్రభుత్వంలో ఒక్క ఉపాధ్యాయ నియామకం చేపట్టలేదు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-12-11T21:41:50+05:30 IST