KTR: కాంగ్రెస్‌కు పోటీ చేయడానికి ఈ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు.. మరి ఎలా గెలుస్తుంది
ABN , First Publish Date - 2023-10-13T20:57:22+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక (Telangana Assembly Election)ల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ(Congress party)కి అభ్యర్థులే లేరు.. అలాంటి పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతుంటే హస్యస్పందంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు(Minister KTR) అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక (Telangana Assembly Election)ల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ(Congress party)కి అభ్యర్థులే లేరు.. అలాంటి పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతుంటే హస్యస్పందంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు(Minister KTR) అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘మా అభ్యర్థులు 114 మంది అభ్యర్థులు ప్రచారంలో దూసుకు పోతున్నారు. మిగతా ఐదుగురు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తాం. కాంగ్రెస్‌కు 40 చోట్ల అభ్యర్థులే లేరు.. అలాంటప్పుడు 70 చోట్లా ఎలా గెలుస్తామని చెబుతారు. పాత రంగారెడ్డి కలిపి 29 సీట్లు.. ఇక్కడ 25 చోట్ల కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు. డబ్బులు ఇచ్చిన వారికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టికెట్లు ఇస్తున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ నేత ఒకరు నన్ను కలిశారు. కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆయనను 15 కోట్ల రూపాయలు అడిగారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
పొన్నాల పార్టీలో చేరతానంటే ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తా...
‘‘మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ ఎస్‌లో చేరతానంటే ఆయన ఇంటికీ రేపే వెళ్లి ఆహ్వానం పలుకుతా. గతంలో నేను చెప్పినట్లే కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతోంది. అక్కడ స్క్వేర్ ఫీట్‌కు 500 వసూల్ చేస్తున్నారు. తెలంగాణకు తరలించడానికి సిద్ధంగా ఉన్న 42 కోట్ల రూపాయలు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికాయి. 8 కోట్లు ఇదివరకే కొడంగల్‌కు చేరినట్టు మాకు సమాచారం ఉంది. కాంగ్రెస్ సిద్ధాంత ప్రాతిపదికన ఎన్నికలు కొట్లాడటం లేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లీడర్ కాదు రీడర్. ఏం రాసిస్తే అది చదువుతారు. కాంగ్రెస్‌లో టికెట్ల ప్రకటన తర్వాత గాంధీ భవన్‌లో తన్నుకుంటారు. కాంగ్రెస్ అంటే గందర గోళం, ఆగమాగం. కాంగ్రెస్‌లో అప్పుడే సీఎం పదవికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు నాకు సమాచారం ఉంది. గతంలో ఉంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడినట్టే ఇప్పుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు’’ అని మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.