KTR: గవర్నర్ తమిళిసై మండిపడ్డ మంత్రి కేటీఆర్.. కిషన్‌రెడ్డి అన్‌ఫిట్ అంటూ వ్యాఖ్య
ABN , First Publish Date - 2023-09-26T16:50:56+05:30 IST
కిషన్ రెడ్డి మోస్ట్ అన్‌ఫిట్ లీడర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయినా ఆయన గురించి మాట్లాడటం వెస్ట్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. రేపు కాంగ్రెస్ వాళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan)పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను తమిళిసై తిరస్కరించడంపై మండిపడ్డారు. గవర్నర్ పదవికి తమిళిసై అనర్హులు అంటూ ధ్వజమెత్తారు. అయినా దేశంలో గవర్నర్ పోస్ట్ అవసరమా? అని అడిగారు. మొన్నటి వరకు గవర్నర్ కూడా ఓ రాష్ట్రానికి బీజేపీ ప్రెసిడెంటే కదా? అన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం ఉంటే తప్పేంటి అని నిలదీశారు. దాసోజు శ్రవణ్ ప్రజా ఉద్యమాల్లో ఉన్నారని.. కుర్రా సత్యనారాయణ ట్రేడ్ యూనియన్ నేతగా జాతీయ స్థాయిలో పని చేశారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నారని ప్రతిపాదన తిరస్కరిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు రాజకీయ పార్టీతో సంబంధం లేదా? మోదీ ఏజెంట్‌లు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని.. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయినా బలహీన వర్గాల నేతలను కౌన్సిల్‌కు పంపితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అని తమిళిసైను ప్రశ్నించారు. మళ్లీ డాక్యుమెంట్స్‌తో గవర్నర్‌కు ప్రతిపాదన పంపుతామని స్పష్టం చేశారు. గవర్నర్ మనసుతో ఆలోచిస్తే నిర్ణయం ఇలా రాకపోతుండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
కిషన్‌రెడ్డి గురించి మాట్లాడటం వెస్ట్..
కిషన్ రెడ్డి మోస్ట్ అన్‌ఫిట్ లీడర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయినా ఆయన గురించి మాట్లాడటం వెస్ట్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. రేపు కాంగ్రెస్ వాళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని తెలిపారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ మీద పగ బట్టాయని కేటీఆర్ తెలిపారు.