Share News

Minister Sridhar Babu: ఆర్థిక అంశాలను ప్రజల ముందు ఉంచాం

ABN , Publish Date - Dec 21 , 2023 | 10:54 PM

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ( Congress Party Manifesto ) ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో తాము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచామని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) స్పష్టం చేశారు.

Minister Sridhar Babu: ఆర్థిక అంశాలను ప్రజల ముందు ఉంచాం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ( Congress Party Manifesto ) ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో తాము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచామని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) స్పష్టం చేశారు. గురువారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీధర్ బాబు మాట్లాడుతూ...‘‘ గత పదేళ్లలో బీఆర్ఎస్ ( BRS )పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశాం. శ్వేత పత్రాలు నిజమేనని అప్పులు చేశాం. చేసిన ఖర్చు వల్ల ప్రయోజనాలు లేవని ఒప్పుకున్నారు. రాష్ట్రంలో ప్రతి యువకుడిపై 7లక్షల అప్పును బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వం మోపింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు అభివృద్ధి అడుగులు వేస్తే ... బీఆర్ఎస్ ( BRS ) పదేళ్లు అనుభవించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు చేయకపోతే BRS 12 గంటల కరెంట్ ఇచ్చేది కాదు. అప్పులపై జవాబు చెప్పలేక బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యేలు తెల్లమొహాలు పెట్టారు. రేషన్ బియ్యం పంపిణీ, రైతులకు మద్దతు ధర , విద్యా వ్యవస్థపై సమాధానం చెప్పకుండా BRS నాయకులు తెల్లమొహం వేసుకోని కూర్చున్నారు. గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా విధానం ఎలా ఉంది అంటే బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యేలు తెల్లమొహం వేసుకోని కూర్చున్నారు’’ అని మంత్రి శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు.


అసెంబ్లీలో పెట్టిన ప్రతి లెక్క వాస్తవం

‘‘మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్సీ , ఎస్టీలకు నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పలేకపోతున్నారు. 2018లో అసెంబ్లీలో ఈ పార్టీ ఎంతసేపు మాట్లాడిందో లెక్కలు చెప్పలేదు ఎందుకంటే బీఆర్ఎస్ ( BRS ) కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు కాబట్టి. లెక్కలు తప్పులు అనేది అవాస్తవం...తేదీలు వేయలేదు కాబట్టి కన్ఫ్యూజన్ ఏర్పడింది. అసెంబ్లీలో పెట్టిన ప్రతి లెక్క వాస్తవం..కావాలంటే స్పీకర్ అదేశంతో ప్రతీ సభ్యుడికి అందిస్తాం. శ్వేత పత్రం లెక్కలు ఎవ్వరినీ కించపరచడానికి కాదు. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ సంశయించలేదు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు, డొమెస్టిక్ వినియోగ దారులకు పూర్తి స్థాయిలో కరెంట్ ఇస్తాం. ప్రజాస్వామ్య దృక్పథంతో లెక్కలు ప్రజల ముందు పెట్టాం. గతంలో బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత అసెంబ్లీ పెట్టీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మేము ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే అసెంబ్లీ పెట్టాం. ఎవరినో క్రిటిసైజ్ చేద్దామని అసెంబ్లీ సమావేశాలు పెట్టలేదు. గత ప్రభుత్వం పాలనలో తప్పులు జరిగాయి’’ అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Updated Date - Dec 21 , 2023 | 10:54 PM