Talasani: ‘మోదీ వెంటనే దిగిపోవాలి... మీకు పాలించే హక్కు లేదు’

ABN , First Publish Date - 2023-03-02T11:47:10+05:30 IST

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఎంజీ రోడ్డులో గల గాంధీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ ఆందోళనకు దిగింది.

Talasani: ‘మోదీ వెంటనే దిగిపోవాలి... మీకు పాలించే హక్కు లేదు’

హైదరాబాద్: పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఎంజీ రోడ్డులో గల గాంధీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ (BRS) ఆందోళనకు దిగింది. గ్యాస్ సిలెండర్‌లతో నిరసన, ధర్నా చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Yadav), మహిళల ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని (Telangana Minister) మాట్లాడుతూ.. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఉన్నప్పుడు గ్యాస్ ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. మోదీ ఎన్నికల సందర్భంగా గ్యాస్‌కు దండం పెట్టి ఓటు వేయాలని చెప్పారని... కానీ ఇప్పుడు ధరలు రూ.1100 దాటిందన్నారు. కేంద్ర ఫ్లైట్ చార్జీలు తగ్గించిందని... విమానాల్లో పేదలు వెళ్తారా అని మంత్రి ప్రశ్నించారు.

ప్రతి బడ్జెట్ తర్వత గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్యాస్ ధరలు రూ.50 పెంచడంతో... ఇప్పుడు రూ.1155కు చేరిందన్నారు. మోదీ వచ్చాక దాదాపు రూ.750 గ్యాస్ ధర పెరిగిందని తెలిపారు. దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరుగుతాయన్నారు. సబ్సిడీ ఇస్తున్నాం అని చెప్పారని.. ఏటా బడ్జెట్‌లో సబ్సిడీ నిధులను కేంద్రం తగ్గిస్తోందని అన్నారు. మోదీకి పాలించే హక్కు లేదని... వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. పేదల నడ్డి విరిచే ప్రధాని ఎవరికీ అవసరం లేదన్నారు. పేదల బ్రతుకులు దుర్భరంగా మారాయన్నారు. కేంద్రం తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2023-03-02T11:53:48+05:30 IST