Minister Vemula: ‘కవితమ్మా.. ధైర్యంగా ఉండండి.. మేము మీతో పాటే ఉన్నాం’

ABN , First Publish Date - 2023-03-11T10:11:37+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు.

Minister Vemula: ‘కవితమ్మా.. ధైర్యంగా ఉండండి.. మేము మీతో పాటే ఉన్నాం’

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో కవిత (Kavitha) కు బీఆర్‌ఎస్ మంత్రులు, నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. ధైర్యంగా ఉండాలంటూ అభయమిస్తున్నారు. కవిత ఈడీ విచారణపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘కవితమ్మా ... ధైర్యంగా ఉండండి. పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?. కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాము.. ఉంటము కూడా. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే’’ అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

మరోవైపు ఢిల్లీలో కవితకు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. ఢిల్లీలో కవితను కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మలోత్ కవిత, కేకే, బిబి పాటిల్, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పట్నం మహీందర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, సహా పలువురు బీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. ఈరోజు ఉదయం ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో జాగృతి ప్రతినిధులకు కవిత అల్పాహారం ఏర్పాటు చేశారు.

కాగా.. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది. మార్చి 9న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో 11న ఈడీ విచారణకు హాజరవుతానని కవిత వెల్లడించారు. కవిత విజ్ఞప్తితో ఈరోజుకు విచారణ తేదీని ఈడీ అధికారులు ఖరారు చేశారు.

********************************************************************

ఇవి కూడా చదవండి

MLC Kavitha : ఉదయం 7:30 గంటలకు వారితో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..

MLC Kavitha : ఢిల్లీకి మారిన తెలంగాణ రాజకీయం.. క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు

MLC Kavitha ; నిజమైన రంగులు వెలిసిపోవంటూ పోస్టర్లు..




Updated Date - 2023-03-11T10:17:09+05:30 IST