MLA Sitakka: బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది

ABN , First Publish Date - 2023-10-06T18:22:58+05:30 IST

బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే సీతక్క(MLA Sitakka) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సెక్రటేరియట్(Secretariat) మెయిన్ గెట్ ముందు ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది.

MLA Sitakka: బీఆర్ఎస్  ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే సీతక్క(MLA Sitakka) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సెక్రటేరియట్(Secretariat) మెయిన్ గెట్ ముందు ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం లోపలినుంచి అనుమతి లేదని సీతక్కను పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తన వాహనం దిగి నడుచుకుంటూ సచివాలయం లోపలికి వెళ్లారు. పోలీసుల తీరుపై సీతక్క అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ..‘‘వివిధ శాఖలకు సంబంధించిన పనులపై సెక్రటేరియట్‌కు వచ్చాను. లోపలికి వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకున్నారు.

సెక్రటేరియట్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చూపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సచివాలయం లోపలికి ఎందుకు అనుమతించడం లేదు. ఇది చాలా అవమానం. నేను రచ్చ చేయాలి అనుకుంటే చేయగలను.. కానీ ప్రజా సమస్యలపై ఇక్కడకు వచ్చాను. సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు రాడు... వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారు. అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు.సెక్రటేరియట్ కేవలం బీఆర్ఎస్ నేతలకేనా.. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండి. హోంమంత్రిగా ఉండి గన్‌మెన్లను కొట్టడం ఏంటి. ఈ విషయంపై పోలీసులకు పౌరుషం రావాలి. హోంమంత్రి వెంటనే సంబంధిత గన్‌మెన్‌కు క్షమాపణ చెప్పాలి’’ అని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-06T18:24:24+05:30 IST