Nara Lokesh: జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
ABN , First Publish Date - 2023-11-02T20:57:05+05:30 IST
సీఎం జగన్ ( cm jagan) మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు.
హైదరాబాద్: సీఎం జగన్ ( cm jagan) మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు. గురువారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ ఏపీలో సుపరిపాలన అందించడానికి జగన్‌రెడ్డిని ప్రజలు సీఎం చేశారన్న విషయం ఆయన మరిచిపోయారు. ఉన్మాదిలా మారి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై రోజుకో తప్పుడు కేసు బనాయిస్తున్నారు. పిచ్చి పీక్స్‌కి చేరిన నేపథ్యంలో సీఎం కుర్చీలో ఉండడానికి జగన్ అనర్హుడు. దిగజారిన జగన్ మానసిక స్థితిపై గవర్నర్ జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాలి’’ అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.