Flood Challans: పోలీసుల క్లారిటీ
ABN , First Publish Date - 2023-07-29T00:32:13+05:30 IST
ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) వాహనదారులు(Motorists) ఎవరైనా ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) అతిక్రమిస్తే ఫొటోలను క్లిక్ మనిపిస్తుంటారు.
హైదరాబాద్(Hyderabad): ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) వాహనదారులు(Motorists) ఎవరైనా ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) అతిక్రమిస్తే ఫొటోలను క్లిక్ మనిపిస్తుంటారు. అప్పుడప్పుడు ఇలాంటి ఫొటోలు(Photos) తెగ వైరల్(viral) అవుతుంటాయి. అయితే గత 10 రోజులుగా తెలంగాణ(Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కాలనీలో భారీ వర్షంతో రోడ్డుపైకి వరద రావడంతో ట్రాఫిక్ పోలీసు ప్రత్యామ్నాయ చర్యల కోసం ఓ వీడియో తీశారు. ఈ వీడియోనే సోషల్ మీడియా(Social media)లో బాగా వైరల్ అయింది. కానీ నెటిజన్లు (Netizens) మాత్రం ఈ వీడియోను మరోలా అర్ధం చేసుకోవడంతో అక్కడే పొరపాటు జరిగింది. వరదల్లోనూ ఓ ట్రాఫిక్ పోలీస్ చలాన్ల(challans) కోసం ఫొటోలు తీస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను వైరల్ చేయడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ వీడియో తీయడానికి గల కారణాలను తెలిపారు. కాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Cyberabad Traffic Police) స్పందిస్తూ పై వీడియోలో ఏ విధమైన చలాన్ వేయలేదని, అయోధ్య క్రాస్ రోడ్డు(Ayodhya Cross Road)లో వాటర్ లాగింగ్(Water logging) అయితే తొలగింపు చర్యల కోసం ఆ వీడియో(Video) తీసినట్టు స్పష్టం చేయడంతో నెటిజన్లు ముక్కున వేలేసుకున్నారు.