Ponguleti Srinivasareddy : మీకు అధికారం .. మంత్రి పదవి సోనియా గాంధీ పెట్టిన భిక్ష

ABN , First Publish Date - 2023-07-17T13:45:36+05:30 IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితమని ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాహుల్ గాంధీ పై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. రాహుల్ గాంధీని అనే ముందు .. కేటీఆర్‌కు వ్యవసాయం గురించి ఏం తెలుసో చెప్పాలన్నారు. ఒక వేలు రాహుల్ గాంధీ వైపు చూపిస్తే .. నాలుగు వేళ్లు మీ వైపు చూపుతున్నాయని తెలుసుకోవాలని పొంగులేటి హితవు పలికారు.

Ponguleti Srinivasareddy : మీకు అధికారం .. మంత్రి పదవి సోనియా గాంధీ పెట్టిన భిక్ష

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితమని ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాహుల్ గాంధీ పై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. రాహుల్ గాంధీని అనే ముందు .. కేటీఆర్‌కు వ్యవసాయం గురించి ఏం తెలుసో చెప్పాలన్నారు. ఒక వేలు రాహుల్ గాంధీ వైపు చూపిస్తే .. నాలుగు వేళ్లు మీ వైపు చూపుతున్నాయని తెలుసుకోవాలని పొంగులేటి హితవు పలికారు.

రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని పొంగులేటి అన్నారు. రాహుల్ గాంధీకి అపారమైన విషయ పరిజ్ఞానం ఉందని.. భారత్ జోడో పాదయాత్రలో భాగంగా దేశంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారన్నారు. మీ ఫామ్ హౌస్‌లో క్యాప్సికమ్ పంటకు కోట్లు సంపాదించామని చెప్పిన మీరు.. మరి రాష్ట్రంలో రైతులకు ఆ ఫార్ములా ఏంటనేది ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాహుల్ పై విమర్శలు చేసే కేటీఆర్ ఏనాడైనా పాదయాత్ర చేశాడా? అని నిలదీశారు. మీకు అధికారం .. మంత్రి పదవి సోనియా గాంధీ పెట్టిన భిక్ష అని పొంగులేటి అన్నారు.

సీఎం కేసీఆర్ ఓ మాయల మరాఠీ అని పొంగులేటి విమర్శించారు. ఉచిత విద్యుత్‌కు సంబంధించిన పేటెంట్ రైట్ కేవలం కాంగ్రెస్‌కే ఉందన్నారు. విద్యుత్‌పై బీఆర్ఎస్ మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను వక్రీకరించి పబ్బం గడుపుకోవాలని కేటీఆర్ చూస్తున్నారన్నారు. తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ పదవి ఇచ్చినందుకు అధిష్టానానికి రాష్ట్ర పీసీసీ, సీఎల్పీ సహా ముఖ్య నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో అందరినీ కలుపుకొని పనిచేస్తానన్నారు. సీనియర్ల సలహాలు సూచనలతో ముందుకు వెళతానని.. పార్టీ ఏ గీత గీస్తే దాన్ని శిరసావహిస్తానని పొంగులేటి తెలిపారు.

Updated Date - 2023-07-17T13:45:36+05:30 IST