Preethi Sister: మెడికో ప్రీతి సోదరికి HMDAలో ఉద్యోగం
ABN , First Publish Date - 2023-05-20T20:13:00+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్‌కు చెందిన మెడికో ప్రీతి) కుటుంబానికి హామీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీతి చెల్లెలుపూజకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. హెచ్ఎండీఏ ఐటీ సెల్‌లో కాంట్రాక్టు బేసిస్(Contract Basis)లో సపోర్ట్ అసోసియేట్(Support Associate)గా ఉద్యోగం ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్(Warangal)కు చెందిన మెడికో ప్రీతి(Medico Preethi) కుటుంబానికి హామీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీతి చెల్లెలు(Preethi Sister) పూజకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. హెచ్ఎండీఏ(HMDA) ఐటీ సెల్(IT Cell)లో కాంట్రాక్టు బేసిస్(Contract Basis)లో సపోర్ట్ అసోసియేట్(Support Associate)గా ఉద్యోగం ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న ప్రీతి సీనియర్ వేధింపులు తాళలేక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడింది. మెడికో ప్రీతిని సీనియర్ మెడికో సైఫ్ వేధించడంతో ఫిబ్రవరి 26న ప్రీతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సైఫ్ మెడికో ప్రీతిని వేధించినట్లు తేలింది. ప్రీతి మృతి కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రీతి కుటుంబంలో ఒకరికీ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి..ఇవాళ పూజకు ఉద్యోగం ఇచ్చింది.