Sabita Indra Reddy: విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య బాధాకరం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం

ABN , First Publish Date - 2023-03-01T18:35:48+05:30 IST

నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ (Student Satvik) ఆత్మహత్య బాధాకరమని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) అన్నారు.

Sabita Indra Reddy: విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య బాధాకరం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం

హైదరాబాద్: నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ (Student Satvik) ఆత్మహత్య బాధాకరమని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) అన్నారు. సూసైడ్ ఘటన తెలియగానే బాధపడ్డనని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానని సబిత చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా కాలేజ్ లో కొన్ని మార్పులు తెస్తున్నామని, ప్రతీ కాలేజీలో కౌన్సిలర్స్‌ను నియమించాలని చెబుతున్నామని ఆమె తెలిపారు. కాలేజ్‌ యాజమాన్యలు విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడాలని మంత్రి సబిత అన్నారు.

విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలని, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించాలని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా విచారణ నివేదిక అందించాలని ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ (IAS Naveen Mittal) కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Telangana Minister) ఆదేశాలు జారీ చేశారు.

వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా..

ఏబీఎన్‌ (ABN) చేతిలో విద్యార్థి సాత్విక్ సూసైడ్ లెటర్ ఉంది. అమ్మానాన్న నన్ను క్షమించండని సాత్విక్ (Satvik) సూసైడ్ లేఖ (suicide letter)లో పేర్కొన్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని సూసైడ్ లేఖలో సాత్విక్ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోండి అంటూ సాత్విక్ పేర్కొన్నారు. అమ్మానాన్న లవ్ యూ.. మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ సాత్విక్ తాను రాసిన సూసైడ్ లేఖలో వెల్లడించారు.

ఇంటర్ విద్యార్థి సాత్విక్ రాత్రి పదిన్నర గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందిందని నార్సింగి ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశామన్నారు. సాత్విక్ మృతికి బాధ్యులైన ఆచార్య కృష్ణారెడ్డి, నరేష్ పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చామని తెలిపారు. కాలేజీలో ఒత్తిడి, వేధింపుల వల్లనే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని వెల్లడించారు.

సాత్విక్ మృతిపై విచారణ చేస్తున్నామని.. బాధ్యుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నార్సింగి ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. విద్యార్థుల మీద కళాశాల ఒత్తిడిలే మరణానికి కారణం అవుతూ ఉన్నాయన్నారు. క్యాంపస్‌లో విద్యార్థుల మీద భౌతిక దాడి జరిగినట్టు వీడియోలు హల్చల్ అవుతున్నాయన్నారు. ఆ వీడియోల పైన సైతం విచారణ చేస్తున్నామని.. అందులో కొన్ని పాత వీడియోలు కూడా ఉన్నాయన్నారు.ఈ కేసులో ఇప్పటికే ఆచార్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. సాత్విక్ కుటుంబానికి చట్టపరమైన న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

నగరంలోని నార్సింగిలో ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ (Inter Student Satvik) అనే ఇంటర్ స్టూడెంట్ కళాశాలలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒత్తిడి వల్లే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ సిబ్బంది తీరుపై సాత్విక్ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాలేజీ సిబ్బంది తీరువల్లే సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ తల్లిదండ్రుల ధర్నాకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో నార్సింగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

విద్యార్థి సంఘాల అరెస్ట్...

సాత్విక్ మృతికి నిరసనగా విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘాలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మృతుడి తల్లిదండ్రులు కాలేజీ ముందే బైఠాయించి న్యాయం కోసం నిరీక్షిస్తున్నారు.

భారీ బందోబస్తు...

కాగా... నార్సింగ్ కార్పొరేట్ కళాశాల ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. కాలేజీ ముందు ఆందోళనల రీత్యా ముందస్తు భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య బాధాకరం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం

సీఎం జగన్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా..సూసైడ్ లేఖలో సాత్విక్

తిరుమలలో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి చేదు అనుభవం

Updated Date - 2023-03-01T18:51:38+05:30 IST