BJP: ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు
ABN , First Publish Date - 2023-07-24T10:59:51+05:30 IST
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ముఖ్యనేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి వారివారి అభిప్రాయాలను బీజేపీ సీనియర్ నేతలు తెలుసుకుంటున్నారు. అలాగే కేసీఆర్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. అటు సోషల్ మీడియా ద్వారా కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏకిపారేయాలని బీజేపీ నాయకత్వం సన్నద్దమైంది. ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు (Nizamabad MP Dharmapuri Arvind) సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కమలం పార్టీ డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో ఎంపీకి సోషల్ మీడియా బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే కేసీఆర్ సర్కార్ అవినీతిని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎంపీ అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పజెప్పాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది.