TS News: కేటీఆర్, కవితపై అమిత్ షాకు సుకేశ్ ఫిర్యాదు.. దేనికోసమంటే..!
ABN , First Publish Date - 2023-07-21T17:28:12+05:30 IST
ఇటీవల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్‌పై సీబీఐ, తెలంగాణ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు లేఖలో సుకేశ్ పేర్కొన్నారు. తాను ఫిర్యాదు చేసినందుకే అనుచరులతో ఒత్తిడి చేస్తూ కేటీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సుకేశ్ ఆరోపించారు.
ఢిల్లీ: మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో లేఖాస్త్రం సంధించారు. ఈసారి కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. ఇప్పటికే సీబీఐ, తెలంగాణ గవర్నర్ తమిళిసైకు లేఖ రాయగా.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు (Amit Shah) లెటర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
లేఖలో ఏముంది అంటే..
ఇటీవల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, (KTR and Kavitha) బీఆర్ఎస్‌పై సీబీఐ, తెలంగాణ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు లేఖలో సుకేశ్ పేర్కొన్నారు. తాను ఫిర్యాదు చేసినందుకే అనుచరులతో ఒత్తిడి చేస్తూ కేటీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సుకేశ్ ఆరోపించారు. లీగల్ నోటీసులతో కేసులు వెనక్కి తీసుకోవాలంటూ కేటీఆర్ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్ తప్పుచేశారు కాబట్టే అనుచరులను ఉసిగొల్పుతున్నారని.. ఇప్పటివరకు కేటీఆర్, కవితపై తాను చేసిన ఫిర్యాదులపై సీబీఐతో విచారణ చేపట్టాలని సుకేశ్ చంద్రశేఖర్ లేఖలో అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.