Talasani: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన తలసాని

ABN , First Publish Date - 2023-10-04T15:30:48+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్ చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) వ్యాఖ్యానించారు.

Talasani: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన తలసాని

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్ చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. బుధవారం నాడు మంత్రి కార్యాలయంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ..‘‘ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసింది. అధికారం శాశ్వతం కాదు. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. సుమారు 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు’’ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-04T15:30:48+05:30 IST