T.BJP Chief: రాహుల్ మాట్లాడినవన్నీ అబద్దాలే.. మతిమరుపు పెరిగినట్టుంది.. కిషన్‌రెడ్డి ఫైర్
ABN , First Publish Date - 2023-10-19T12:48:52+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన చేస్తున్నారని.. రాసిచ్చిన పేపర్‌ను రాహుల్ గాంధీ చదివారని తెలిపారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Congress Leader Rahula Gandhi) కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో(Telangana State) కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పర్యటన చేస్తున్నారని.. రాసిచ్చిన పేపర్‌ను రాహుల్ గాంధీ చదివారని తెలిపారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీమ్ అంటూ రాహుల్ అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్‌కు మతిమరుపు పెరిగినట్టుందని వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల నుంచి అధికారంలో లేరని.. రాహుల్ గాంధీకి దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. 2004లో కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్ (BRS) వేదిక పంచుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా పని చేశారన్నారు. రాహుల్ గాంధీ రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
మోసపూరిత మాటలు రాహుల్, ప్రియాంక మాట్లాడుతున్నారన్నారు. 2004లో గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే వారు బీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తడానికి బీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరారని.. రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు బీ టీమ్ అవుతారని. తాము ఎప్పుడూ కూడా బీఆర్‌ఎస్‌లో చేరలేదన్నారు. బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో మెర్జ్ చేసేందుకు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి కాళ్ళు మొక్కారంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌పై ఓటుకు నోటు కేసు ఎందుకు తొక్కి పెట్టారని నిలదీశారు. అన్ని విషయాల్లో మజ్లిస్ పార్టీ మధ్యవర్తిగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించి నాటకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం డీఎన్‌ఏ ఒకటే అన్నారు. మోదీనీ దెబ్బతీయాలని పని చేస్తున్నారని అన్నారు. ‘‘రాహుల్ గాంధీ చర్చకు సిద్ధమా ?..ఎక్కడైనా నేను సిద్దంగా ఉన్నాను. తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ అడగాలి’’ అంటూ కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.