Telangana BJP Chief: చంద్రబాబు అరెస్ట్‌పై కిషన్‌రెడ్డి రియాక్షన్
ABN , First Publish Date - 2023-09-14T15:47:05+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అన్యాయమన్నారు.
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై (Chandrababu Arrest) తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. మాజీ ముఖ్యమంత్రిని దర్యాప్తు చేసే ముందు ప్రశ్నించకుండా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్టు చేసే సమయంలో నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర శాఖ ఇప్పటి వరకు ఏ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను బీజేపీ అడ్డుకుంటుందని అనడం సరికాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.