TS News: వాస్తవాలు చెప్పాను... రేవంత్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు: కేటీఆర్
ABN , First Publish Date - 2023-03-27T20:07:25+05:30 IST
టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తన పీఏ తిరుపతి (Tirupati) పాత్ర ఉందంటూ ప్రచారంపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తన పీఏ తిరుపతి (Tirupati) పాత్ర ఉందంటూ ప్రచారంపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. జగిత్యాల జిల్లా మొత్తంలో ఒక్కరే క్వాలిఫై అయ్యారని అన్నారు. తన పీఏ (PA) వెంట పడతారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పోతారంలో పరీక్ష రాసింది ముగ్గురేనని, అందులో ఒక్కరూ క్వాలిఫై కాలేదన్నారు. మాల్యాలలో ముగ్గురు గ్రూప్-1 రాస్తే.. ఒక్కరే క్వాలిఫై అయ్యారని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలో ఒక్కరికి కూడా 100 మార్కులు రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. మరి తాను లీక్ చేసింది ఎక్కడ?, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో 3,250 మంది పరీక్ష రాస్తే.. ఒక్కరికీ వంద మార్కులు రాలేదన్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్, బండి సంజయ్ తమ జీవితంలో ఎప్పుడైనా పరీక్షలు రాశారా అని వ్యంగ్యం మాట్లాడారు. నకిలీ సర్టిఫికెట్లతో దొరికిపోయింది ఎవరు... నిజామాబాద్ ఎంపీ కాదా? అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు చెప్పాను, మరీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడని? అని ప్రశ్నించారు.