MLC Kavitha: ఈడీపై కవిత పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం
ABN , First Publish Date - 2023-07-28T14:50:26+05:30 IST
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది.
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. శుక్రవారం జరిగిన విచారణలో మహిళను విచారణ కోసం ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ (Sanjay Kishan Kaur) ధర్మాసనం.. కవిత పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుంది. కవిత పిటిషన్‌పై ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి న్యాయస్థానం ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజోయిండర్ (Rejoinder) దాఖలు చేయాలని కవితకు సూచించారు. కాగా కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ (Kapil Sibal), ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) వాదనలు వినిపించారు. అలాగే విచారణకు హాజరైన తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు.