Share News

Congress High Command: ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం.. సీఎం అభ్యర్థిపై హైకమాండ్ క్లారిటీ

ABN , First Publish Date - 2023-12-05T14:55:29+05:30 IST

Telangana: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పాల్గొన్నారు.

Congress High Command: ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం.. సీఎం అభ్యర్థిపై హైకమాండ్ క్లారిటీ

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో (AICC Chief Mallikarjuna Kharge) కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) సమావేశం ముగిసింది. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపిన ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి డీకే అందజేశారు. సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే నివాసం నుంచి రాహుల్, కేసీ వేణుగోపాల్ వెళ్లిపోయారు. మరికాసేపట్లో డీకే శివకుమార్ హైదరాబాద్‌కు బయలుదేరి రానున్నారు. అధిష్టానం నిర్ణయించిన సీఎం అభ్యర్థి పేరును డీకే హైదరాబాద్‌లో ప్రకటించనున్నారు. ఇప్పటికే సీఎం అభ్యర్థిపై హైకమాండ్‌ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన పదవుల కేటాయింపుపైనా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఖర్గేతో భేటీకి ముందు ఉత్తమ్‌ కుమార్, భట్టి విక్రమార్కతో డీకే, ఠాక్రేలతో వేర్వేరుగా చర్చలు జరిపారు.

Updated Date - 2023-12-05T15:02:41+05:30 IST