Share News

IPS Transfers: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

ABN , Publish Date - Dec 17 , 2023 | 09:06 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్‌రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది.

 IPS Transfers: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్‌రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది. తాజాగా 10 మంది ఐపీఎస్‌ అధికారులను వివిధ శాఖలకు బదిలీ చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే..

ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ అదనపు సీపీగా ఉన్న విశ్వ ప్రసాద్‌ని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చీఫ్‌గా బదిలీ చేశారు.

హైదరాబాద్‌ క్రైమ్‌ చీఫ్‌గా ఏవీ రంగనాథ్‌.. జాయింట్ సీపీ గసరావు భూపాల్ స్థానంలో ఏవీ రంగనాథ్‌ని నియమించారు.

వెస్ట్‌జోన్‌ డీసీపీగా జోయల్ డేవిస్ స్థానంలో విజయ్‌కుమార్‌ని నియమించారు.

హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ చీఫ్‌గా జ్యోయల్ డెవిస్‌ నియమించారు.

నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తిని బదిలీ చేశారు. ఆమె స్థానంలో నార్త్‌జోన్‌ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని నియమించారు..

కాగా ప్రస్తుతం మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని పనిచేస్తున్నారు.

డీసీపీ డీడీగా సిద్దిపేట కమిషనర్ శ్వేతని.. ట్రాఫిక్‌ డీసీపీగా సుబ్బరాయుడుని నియమించారు.

మాదాపూర్ డీసీపీ సందీప్‌పై వేటు వేశారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ రావ్‌ని బదిలీ చేశారు.

హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా బాలాదేవిని నియమించారు.

టాస్క్‌ఫోర్స్ డీసీపీ నిఖితపంత్, సిట్‌ చీఫ్‌ గజారావు భూపాల్‌, చందనా దీప్తిలను డీజీపీ ఆఫీస్‌కు రిపోర్ట్‌ చేయాలని సీఎస్ ఆదేశించారు.

వీరిలో మొత్తం 10 మంది ఐపీఎస్‌లతో పాటు 5 గురు నాన్ క్యాడర్ ఎస్పీలను కూడా తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది.

Updated Date - Dec 17 , 2023 | 09:06 PM