Ugadi Celebrations: గాంధీభవన్‌లో ఉగాది వేడుకలు... అందరూ రేవంత్ వెంట నడవాలన్న వేద పండితులు
ABN , First Publish Date - 2023-03-22T13:32:50+05:30 IST
గాంధీభవన్‌లో శ్రీ శుభోకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్: గాంధీభవన్ (Gandhi Bhavan)లో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు చిలుకూరు శ్రీనివాస మూర్తి (Chilukur Srinivasa Murthy) పంచాంగ శ్రవణం పఠించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన పెరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ప్రజలు పాలక పక్షం వైపు ఉంటారని చెప్పారు. సరిహద్దు వివాదాలు పెరుగుతాయని.. నదులు పొంగి ప్రవహిస్తాయన్నారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో నష్టం జరుగుతుందని తెలిపారు. నూతన రాజకీయ కూటములు ఏర్పడుతాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో (Two Telugu States) అల్లర్లు ప్రజలను ఇబ్బంది పెడతాయన్నారు. గంగానది పుష్కరాలు (Ganga River Pushkaras) ఏప్రిల్ 23 నుంచి మొదలుకానున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy)కి అందరూ సహకరించాలని... అందరూ ఆయన వెంట నడవాలి అంటూ చిలుకూరు శ్రీనివాసమూర్తి పంచాంగాన్ని చదివి వినిపించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. బలహీన వర్గాలకు అండగా నిలవాలని సూచించారు. రాహుల్ స్పూర్తితో ప్రజల వద్దకు వెళ్లాలన్నారు. అధికారం ఒక అవకాశం మాత్రమే అని అన్నారు. ప్రజలకు నచ్చితే అధికారం ఇస్తారని.. ప్రజలు నచ్చేలా నడుచుకోవాలన్నారు.
ఉగాది వేడుకల్లో పీసీసీ చీఫ్ రేవంత్‌తో పాటు పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah), మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), సంపత్ (Sampath), సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy), అంజన్ కుమార్ యాదవ్ (Anjan kumar Yadav), మల్లు రవి (Mallu Ravi), వేం నరేందర్ రెడ్డి (Vem Narendar Reddy), రోహిన్ రెడ్డి (Rohin Reddy), హర్కర వేణు గోపాల్ (Harkara Venu gopal) , పార్టీ నేతలు పాల్గొన్నారు.