Share News

Amit Shah: దేశ ప్రతిష్టలు కాపాడటంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకం

ABN , First Publish Date - 2023-10-27T09:44:29+05:30 IST

దేశ ప్రతిష్టలు కాపాడంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం నేషనల్ పోలీస్ అకాడమీలో నూతన ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన ఐపీఎస్‌ల నుంచి గౌరవందనం స్వీకరించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ.. దేశ అత్యున్నత కోసం ఐపీఎస్‌లు పాటుపడాలన్నారు.

Amit Shah: దేశ ప్రతిష్టలు కాపాడటంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకం

హైదరాబాద్: దేశ ప్రతిష్టలు కాపాడంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అన్నారు. శుక్రవారం నేషనల్ పోలీస్ అకాడమీలో నూతన ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో (Passing out parade of new IPSs) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన ఐపీఎస్‌ల నుంచి గౌరవందనం స్వీకరించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ.. దేశ అత్యున్నత కోసం ఐపీఎస్‌లు పాటుపడాలన్నారు. దేశానికి సేవ అందించడంలో ఐపీఎస్‌లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు. పీడిత ప్రజల అభ్యున్నతి వారి భద్రత కోసం ఐపీఎస్‌లు నిబద్దతతో కృషి చేయాలని సూచించారు. 75వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణలో 33 మంది మహిళా ఐపీఎస్‌లు ఉండడం సంతోషం, గర్వకారణమని కొనియాడారు. సైబర్ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్ పెట్టడంలోనూ టెక్నాలజీపై ఐపీఎస్‌లు దృష్టి కేంద్రీకరించాలని కేంద్రమంత్రి తెలిపారు.


నక్సలిజం, టెర్రరిజం వాటిపై ఐపీఎస్‌లు శిక్షణ తీసుకుని శుసిక్తులు అయ్యారన్నారు. భవిష్యత్‌లో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఐపీఎస్‌లు అలవోకగా ఎదురుకోవాలని చెప్పారు. అర్గనేనింగ్ క్రైమ్, సైబర్ క్రైమ్ క్రిప్తో కరెన్సీ, హవాలా చలామణి, నకిలీ నోట్ల చలామణి, గ్రేహౌండ్, నార్కోటిక్స్, ఇంటర్ స్టేట్ గ్యాంగ్, చార్జిషీట్ ఫైల్, ఫోరెన్సిక్ సైన్స్ అన్ని అంశాలపై ఐపీఎస్‌లు పట్టు సాధించాలని అన్నారు. న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రిమినల్ జస్టిస్‌పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. దేశ ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో సంకల్పంతో అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్నారు. అంతిమంగా ఐపీఎస్‌లు ప్రజల భద్రత అందించడంలో మనసులు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.

Updated Date - 2023-10-27T10:22:05+05:30 IST