Sridhar Babu: ప్రజలకు మేలు జరిగేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో
ABN , First Publish Date - 2023-10-06T16:05:06+05:30 IST
ప్రజలకు మేలు జరిగేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు (Sridhar Babu) వ్యాఖ్యానించారు.
కరీంనగర్: ప్రజలకు మేలు జరిగేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు (Sridhar Babu) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు కరీంనర్‌లో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ విఫలం అయింది. తొలివిడతలో ఆరు గ్యారంటీలు ప్రకటించాం. ప్రజల నుంచి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నాం. ఆర్థికవేత్తల సలహాలతో సూచనలతో గ్యారంటీలు రూపొందించాం. కర్ణాటకలో హామీ ఇచ్చిన ఆరు గ్యారేంటీలను తెలంగాణలో అమలు చేస్తున్నాం. 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు పథకం ప్రకటిస్తాం’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.