Revanth Reddy: కాంగ్రెస్‌లో తుమ్మల చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-31T21:04:05+05:30 IST
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao)ని పార్టీలోకి ఆహ్వానించామని.. సమాజానికి ఆయన అవసరం చాలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు.
ఖమ్మం: మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao)ని పార్టీలోకి ఆహ్వానించామని.. సమాజానికి ఆయన అవసరం చాలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు. గురువారం నాడు ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress)లో చేరికపై తన సహచరులు, అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటా అని తుమ్మల చెప్పారు. ఏఐసీసీతో పాటు, ఖమ్మం జిల్లా(Khammam District) ముఖ్య నాయకుల అనుమతితోనే తుమ్మలని కలిశాము.తుమ్మల రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసే వ్యక్తి.తుమ్మల ఖమ్మంకే పరిమితం కాదు.తుమ్మల అన్ని రంగాల మీద అవగాహన ఉన్న నాయకుడు. అవినీతి, అహంకారానికి అలవాటు పడ్డ కేసీఆర్ తుమ్మల లాంటి వాళ్లను రాజకీయాల్లో కనుమరుగు చేయాలని చూస్తున్నారు.కాంట్రాక్టు పనులు చేసుకునే కందాల ఉపేందర్‌రెడ్డి(
Kandala Upender Reddy)ని కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేసింది. కాంగ్రెస్‌కి కందాల ఎక్కువ అన్యాయం చేశారు. కేసీఆర్(KCR)ని తరిమి కొట్టడానికి అందరం ఏకం అవుతున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.