Harish Rao: కాంగ్రెస్‌కు లీడర్ లేడు.. బీజేపీకి క్యాడర్ లేదు
ABN , First Publish Date - 2023-10-04T18:56:22+05:30 IST
కాంగ్రెస్(Congress)కు లీడర్ లేడు.. బీజేపీ(BJP)కి క్యాడర్ లేదని మంత్రి హరీశ్‌రావు(Harish Rao) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు.
మహబూబ్‌నగర్: కాంగ్రెస్(Congress)కు లీడర్ లేడు.. బీజేపీ(BJP)కి క్యాడర్ లేదని మంత్రి హరీశ్‌రావు(Harish Rao) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ‘‘పదేళ్ల ప్రగతి నివేదన సభ’’ పేరుతో కొత్తకోటలో భారీ బహిరంగ సభ జరిపారు. ఈ సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ..‘‘60 ఏళ్లలో జరగని అభివృద్ధి నేడు 10 ఏళ్లలో దేవరకద్ర నియోజకవర్గంలో జరిగింది. వైద్య రంగంలో 5 అంచెల వ్యవస్థను అమలు చేసి పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేటు వైద్యం అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎన్నికష్టాలు వచ్చినా రైతులకు రైతుబంధు ఆపలేదు రైతులపై తమకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.
కర్ణాటకలో 5 హామీలు అమలు చేయలేకపోతున్నామని అక్కడి కాంగ్రేస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ కు మూడు గంటలు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి. కేసీఆర్ పాలనలో భూముల ధరలు పెరిగాయి రైతులకు గౌరవం పెరిగింది. మహిళలకు వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తామే త్వరలో ప్రకటించే మేనిఫెస్టోలో చెబుతాం. కాంగ్రెస్ అంటే బూటకం.. నాటకం.. బీఆర్ఎస్ అంటే నమ్మకం. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో రాబోతుంది. తొమ్మిదేళ్లు నిద్రపోయిన కేంద్రం కృష్ణ జలాల పంపిణీ కోసం ట్రిబ్యూనల్ ఏర్పాటు చేశారు. ఇది సీఎం కేసీఆర్ విజయం.. ఇది తెలంగాణ..ఉద్యమం విజయం.. ట్రిబ్యునల్ వల్ల నిర్మాణం జరిగే ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు జరిగి పాలమూరు జిల్లాకు ఎంతోమేలు జరుగుతుంది. కాంగ్రెస్ మాటలు నమ్మితే ఆగమవుతాం’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.