Supreme Court: తెలంగాణ జడ్జిపై సుప్రీం వేటు.. న్యాయమూర్తి ఆదేశాలను తప్పుబడుతూ సస్పెండ్

ABN , First Publish Date - 2023-08-23T15:31:11+05:30 IST

తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్ అయ్యారు. జడ్జి జయకుమార్‌ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ట్యాంపర్ చేశారన్న కేసులో జడ్జి జయకుమార్ సంచలన తీర్పు ఇచ్చారు.

Supreme Court: తెలంగాణ జడ్జిపై సుప్రీం వేటు.. న్యాయమూర్తి ఆదేశాలను తప్పుబడుతూ సస్పెండ్

హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్ అయ్యారు. న్యాయమూర్తి జయకుమార్‌ను (Justice Jayakumar) సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ట్యాంపర్ చేశారన్న కేసులో జడ్జి జయకుమార్ సంచలన తీర్పు ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) సహా మరో 10 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీసులకు జడ్జి ఆదేశించారు. ఈ పది మందిలో పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కూడా కేసు పెట్టాలని గతంలో జయకుమార్ ఆదేశించారు. రాజ్యాంగబద్దంగా ఏర్పడ్డ వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారని జయకుమార్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. దీంతో జడ్జిని సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-08-23T15:41:35+05:30 IST