Harishrao: కాంగ్రెస్ ది గతమే తప్ప భవిష్యత్తు లేదు

ABN , First Publish Date - 2023-08-11T13:23:42+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Harishrao: కాంగ్రెస్ ది గతమే తప్ప భవిష్యత్తు లేదు

సిద్దిపేట: కాంగ్రెస్‌ పార్టీపై (Congress) మంత్రి హరీశ్‌రావు (Minister Harish rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్‌ దారుణంగా విఫలమైందన్నారు. అసెంబ్లీలోనూ కాంగ్రెస్ తీరు ఎంత దారుణంగా ఉందో చూశారన్నారు. కాంగ్రెస్ ది గతమే తప్ప భవిష్యత్తు లేదని వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్‌లో వాళ్ల గొడవలు వాళ్ళకే తప్ప ప్రజల బాధలు పట్టవని మండిపడ్డారు. బీజేపీకి (BJP) బలం లేదని, కాంగ్రెస్‌కు కాండిడేట్లు లేరని.. ఇక బీఆర్‌ఎస్‌కు తిరుగులేదని అన్నారు. ఎవ్వరు ఔనన్నా.. కాదన్నా బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్ కొట్టడం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అంటున్నారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి నేతలు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

Updated Date - 2023-08-11T13:23:42+05:30 IST