కవితపై రఘునందన్ విమర్శలు... సింపతి కోసమే ఆ జిమ్మిక్కులు

ABN , First Publish Date - 2023-03-08T16:30:05+05:30 IST

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) విమర్శలు గుప్పించారు.

కవితపై రఘునందన్ విమర్శలు... సింపతి కోసమే ఆ జిమ్మిక్కులు

మెదక్: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) విమర్శలు గుప్పించారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుంది ఎమ్మెల్సీ కవిత తీరని రఘునందన్ రావు విమర్శించారు. మహిళా హక్కుల కోసం, మహిళా మంత్రి పదవుల కోసం మాట్లాడని తమ చెల్లె కవిత అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈరోజు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నందుకే నోటీసుల ఇచ్చారని సింపతి కోసం జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మహిళలు కవిత చేస్తున్నటువంటి తప్పులని అర్థం చేసుకున్నారు కాబట్టి సానుభూతి లేదన్నారు. మెదక్ పట్టణంలోని భారత్ ఫంక్షన్ హల్‌లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తీసుకొన్న నోటీసులకు ముందుగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కవితకు ఇచ్చిన ఈడీ నోటీసులకు తెలంగాణ (Telangana) పౌర సమాజానికి సంబంధం లేదన్నారు. అలాగే ఇది బీఆర్ఎస్ (BRS) పార్టీకి సంబంధం లేనటు వంటి అంశమని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షునికి చెప్పి కవిత ఈ వ్యాపారం చేసింది అనుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత తన వ్యక్తిగతంగా చేసుకున్న వ్యాపారo పై ట్వీట్ చేయడం బాధాకరమన్నారు.

Updated Date - 2023-03-08T16:34:24+05:30 IST