MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? సోనియాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్న

ABN , First Publish Date - 2023-09-06T18:52:26+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు.

MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? సోనియాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్న

ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని ఆమె వ్యాఖ్యానించారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ముఖ్యమైన జాతీయ అంశం కాదా? అంటూ కాంగ్రెస్ వైఖరిపై కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాసినట్టుగా ప్రకటించిన ట్వీట్‌ను కూడా ఆమె తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, ఎంపీ శ్రీమతి సోనియా గాంధీ పూర్తిగా విస్మరించడం బాధాకరమన్నారు. లింగ సమానత్వం కోసం కోసం దేశం ఎదురుచూస్తోందని కవిత ట్విటర్‌లో పేర్కొన్నారు.


కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gadhi) బుధవారం ఓ లేఖ రాశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండాను వెల్లడించాలని కోరారు. ఈ సమావేశాల్లో 9 అంశాలపై చర్చించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదించకుండానే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించేందుకు నిర్ణయించారని దుయ్యబట్టారు. ఈ సమావేశాల ఎజెండా గురించి ప్రతిపక్షాలకు తెలియడం లేదన్నారు.

Updated Date - 2023-09-06T18:53:58+05:30 IST