Gutha Sukhenderreddy: సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ముందా రేవంత్.. గుత్తా సూటి ప్రశ్న
ABN , First Publish Date - 2023-07-14T10:44:34+05:30 IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవుపలికారు.
నల్గొండ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తెలంగాణలో విద్యుత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy)హితవుపలికారు. శుక్రవారం గుత్తా మీడియాతో మాట్లాడుతూ.. బషీర్‌బాగ్ కాల్పులకు కారణం కేసీఆర్ అనడం అవగాహన లేకనే అని అన్నారు. తొమ్మిదేళ్లలో ఎకరం పంట ఎక్కడైనా ఎండిందా, సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలు జరిగాయా... అని ప్రశ్నించారు. కరెంటు నిరంతరాయంగా వస్తున్నందునే అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదన్నారు. కరెంటు కొనుగోళ్లు జరిగేది ఎన్ఎల్‌డీసీ నుంచే అని అవినీతి జరిగిందనడం అవివేకమే అని అన్నారు. రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి (Komatireddy Venkatreddy) వ్యవసాయం అంటే తెలియదన్నారు. ఆవారా నంబర్ 1, స్థిమితం లేని వెంకట్ రెడ్డి వ్యవసాయం పేరుతో బావుల దగ్గరికి పోయేది సురా పానకం కోసమే అంటూ వ్యాఖ్యలు చేశారు. 82 ఏళ్ల ఖర్గే ఏఐసీసీగా ఉండొచ్చు కానీ రిటైర్డ్ అయినా సమర్థత ఉన్న అధికారులు ఉద్యోగంలో కొనసాగకూడదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటూ గుత్తాసుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.