Jagadish Reddy: ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులకు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయం
ABN , First Publish Date - 2023-10-26T16:08:41+05:30 IST
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులకు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయమని మంత్రి జగదీష్‌రెడ్డి ( Minister Jagadish Reddy ) హెచ్చరించారు.
సూర్యాపేట: ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులకు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయమని మంత్రి జగదీష్‌రెడ్డి ( Minister Jagadish Reddy ) హెచ్చరించారు. గురువారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ..‘‘భారతదేశంలో ఇవ్వనన్నీ పథకాలను ఇస్తున్న కేసీసిఆర్ నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటే.. బీజేపీ, టీపీసీసీ అధ్యక్షులు కూడబలుక్కుని పసలేని ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రతిష్ట తెలంగాణ దాటి బయటికి వస్తే ప్రమాదమని ఆ పార్టీల నేతలు భయపడుతున్నారు. కర్ణాటకలో విద్యుత్ ఇవ్వడం లేదని కారణంతో సబ్ స్టేషన్లలో మొసళ్లతో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. నాయకులు పార్టీలు మారడం సహజం ప్రజలపై ఆ ప్రభావం ఉండదు. బీఆర్ఎస్‌పై ప్రజల్లో అసంతృప్తి లేదు.
కాంట్రాక్టుల కోసమే కోసం పార్టీలు మారడం, చెరొక పార్టీలో ఉండి మోసం చేయడం కోమటిరెడ్డి సోదరులకు అలవాటు అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాలు తిరిగి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది’’ అని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు.