Bhupalreddy Challenge: నల్గొండలో పోటీ చెయ్.. ఓడించేందుకు సిద్ధం.. కోమటిరెడ్డికి భూపాల్‌రెడ్డి సవాల్
ABN , First Publish Date - 2023-04-29T15:59:38+05:30 IST
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నల్గొండ: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై (Congres MP Komatireddy Venkatreddy) నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupalreddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. ‘‘నల్గొండలో పోటీ చేయి.. నిన్ను ఒడించేందుకు సిద్ధంగా ఉన్న. నల్గొండ అభివృద్ధి కోసం రాజీనామా చేసి, ప్రాణత్యాగానికి సిద్ధం.. నల్గొండ నడిబొడ్డులో బహిరంగ చర్చకు రా. మర్రిగూడ బైపాస్‌లో వేయాల్సిన ప్లై ఓవర్‌ను చర్లపల్లిలో వేసి 32 మందిని, దుప్పలపల్లి ప్లై ఓవర్ వేసి 11మంది ప్రాణాలు బలిగొన్నావు. తమ్ముడి కోసం పాల్వాయి స్రవంతిని ఓడించింది నువ్వు కాదా. అంతా ఒకటే అన్నారు, ముసలి ఎడ్లు వేరుగా వచ్చారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి గురించి అలీబాబా బృందం మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫ్లెక్సీలు చింపేసిన తమరు అవసరానికి బలగం అవతారం ఎత్తుతున్నారా అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ గురించి చెడుగా మాట్లాడితే ఖండించిన ఘనత బీఆర్‌ఎస్ అధినేతకే దక్కిందని కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు.