Share News

Draupadi Murmu: పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది

ABN , Publish Date - Dec 20 , 2023 | 02:05 PM

Telangana: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

Draupadi Murmu: పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది

యాదాద్రి: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) అన్నారు. బుధవారం చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందన్నారు. పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు టీఐజీ ట్యాగ్ రావడం అభినందనీయమని కొనియాడారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగిందన్నారు. భారత సంస్కృతీ సాంప్రదాయాల్లో చేనేత ఒకటన్నారు. భూధాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమని చెప్పుకొచ్చారు. చేనేత వస్త్రాల కృషి గొప్పది, కళను వారసత్వంగా మరొకరికి అందించడం గొప్పదన్నారు. చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు. చేనేత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. తమ ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 20 , 2023 | 02:05 PM