Kishan Reddy: కేటీఆర్ షాడో సీఎం
ABN , First Publish Date - 2023-09-26T19:18:44+05:30 IST
ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.
నిజామాబాద్ జిల్లా: ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నగరంలోని గిరిరాజ్ కాలేజీ మైదానలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘అక్టోబర్ 3వ తేదీన ప్రధాని మోద పర్యటన వస్తారు. 8 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌కు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. లక్ష మందితో సభ నిర్వహిస్తున్నాం. ఖమ్మంలో కూడా పార్టీ బలపడింది. మోదీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశంగా ఉండబోతోంది. మోదీ పర్యటన తర్వాత అమిత్‌షా, నడ్డా పర్యటనలు ఉంటాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాం. హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం మాకు లేదు. కేటీఆర్ షాడో సీఎం. తెలంగాణ కేటీఆర్ జాగీరా..? 17 సార్లు నోటిఫిసెషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వక పోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ నేతల ఎజెండాలో మేము పడబోం. ఎమ్మెల్సీలపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నిర్ణయం సరైనదే. అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు. పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.