Konda surekha: ఐనవోలు జాతరకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:30 PM
ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda surekha ) తెలిపారు. ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లపై మంత్రి సురేఖ ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు హాజరయ్యారు.
హనుమకొండ : ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda surekha ) తెలిపారు. ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లపై మంత్రి సురేఖ ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు హాజరయ్యారు. ఈ జాతర సంక్రాంతికి మొదలై ఉగాది వరకూ జరగనున్నది. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ... అన్ని శాఖల అధికారులు జాతర ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మేడారం, ఐనవోలు, కొమువెల్లి జాతర నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. మేడారం మహాజాతర సవ్యంగా జరిగేలా మంత్రి సీతక్క, తాను ముందుండి పనిచేస్తామని తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. జాతర స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని.. త్వరలోనే ఈ నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.