Share News

Konda Surekha: ఎంజీఎం ప్రక్షాళనపై దృష్టి సారించాం

ABN , Publish Date - Dec 31 , 2023 | 05:57 PM

జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రి ( MGM Hospital ) ప్రక్షాళనపై దృష్టి సారించామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఎంజీఎంలో మంత్రి సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎంలో వసతులు, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంజీఎంలో మొన్న రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ ను పునరుద్దరించారని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

Konda Surekha: ఎంజీఎం ప్రక్షాళనపై దృష్టి సారించాం

వరంగల్: జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రి ( MGM Hospital ) ప్రక్షాళనపై దృష్టి సారించామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఎంజీఎంలో మంత్రి సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎంలో వసతులు, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంజీఎంలో మొన్న రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ ను పునరుద్దరించారని చెప్పారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. హెల్త్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఆస్పత్రి గురించి ఎంజీఎం అధికారులకు సమాచారం లేదని తెలిపారు. ఎంజీఎం జిల్లాకు గుండెకాయలాంటిదని దీనిని కాపాడుకోవాలని చెప్పారు. గతంలో జరిగిన ఘటనలు ఇక పునరావృతం కావని అన్నారు. ఎంజీఎంలో ప్రస్తుతం 25మంది కరోనాతో చికిత్స పొందుతున్నారని.. వారిలో సీరియస్ లక్షణాలు ఏవీ లేవు అయినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందిస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Updated Date - Dec 31 , 2023 | 05:57 PM