Minister Ponguleti: పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం
ABN , Publish Date - Dec 26 , 2023 | 08:12 PM
పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘గత ప్రభుత్వంలో ప్రజలకు, అధికారులకు, మంత్రులకూ స్వేచ్ఛ లేదు.మంత్రులు ఏదీ చేయాలన్నా కల్వకుంట్ల కుటుంబం నుంచి ఆదేశాలు రావాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంతా ఊపిరి పీల్చుకున్నారు’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
హనుమకొండ: పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘గత ప్రభుత్వంలో ప్రజలకు, అధికారులకు, మంత్రులకూ స్వేచ్ఛ లేదు.మంత్రులు ఏదీ చేయాలన్నా కల్వకుంట్ల కుటుంబం నుంచి ఆదేశాలు రావాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంతా ఊపిరి పీల్చుకున్నారు’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం లోపాలమయం
‘‘బీఆర్ఎస్ ( BRS ) నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మలేదు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు. కాళేశ్వరం లోపాలమయం.పేదవాడికి ఇల్లు కట్టియ్యలేదు కానీ... మీరు మాత్రం రాజసౌధాలు నిర్మించుకున్నారు. విద్యుత్ సరఫరాలో లోపాలు బయటపడతాయని లాగ్ బుక్‌లను మాయం చేశారు. పేద ప్రజల సంక్షేమ కోసం ప్రవేశపెట్టిందే ఆరు గ్యారంటీల పథకం. ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే రెండు గ్యారంటీలు అందించాం. గత ప్రభుత్వంలో జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులు లేరు. పాలనను గాలికి వదిలేశారు. ఇప్పుడు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం తీసూకొచ్చాం. ప్రజల దగ్గర అర్జీలు తీసుకుని చిత్తశుద్ధితో వారి సమస్యలు పరిష్కరిస్తాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేమిచ్చిన హామీలు నెరవేరుస్తాం. మీరు అప్లై చేసుకోండి పథకాలు మీ ఇంటి దగ్గరకే వస్తాయి. గతంలో అసెంబ్లీలో మా సభ్యులకు మైక్ ఇవ్వలేదు, కానీ మేము కావాల్సిన సమయం ఇచ్చాం. అదే మా చిత్తశుద్ధిని తెలియజేస్తుంది’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.