Minister Seethakka: మేడారం జాతర పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
ABN , Publish Date - Dec 26 , 2023 | 07:59 PM
మేడారం జాతర ( Medaram Jatara ) పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి సీతక్క ( Minister Seethakka ) పేర్కొన్నారు. మంగళవారం నాడు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలోమంత్రి సీతక్క పర్యటించారు. గుంజేడు ముసలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతక్కకు ఆలయ నిర్వాహకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
మహబూబాబాద్: మేడారం జాతర ( Medaram Jatara ) పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి సీతక్క ( Minister Seethakka ) పేర్కొన్నారు. మంగళవారం నాడు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలోమంత్రి సీతక్క పర్యటించారు. గుంజేడు ముసలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతక్కకు ఆలయ నిర్వాహకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పలు ఆభివృధ్ధి పనులుకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఆరు గ్యారంటీలపై జిల్లా ఆధికారలుతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... ఆరు గ్యారంటీల విషయంలో ఆధికారలు నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మేడారం జాతర సమయం దగ్గర పడుతుందని పనులును త్వరగా చేపట్టాలని ఆదేశించారు.పనుల్లో నాణ్యత తగ్గొద్దని మంత్రి సీతక్క పేర్కొన్నారు.