Revanth Reddy: కేసీఆర్, మోదీలది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానం
ABN , First Publish Date - 2023-02-28T12:56:11+05:30 IST
కేసీఆర్ (KCR), మోదీలది (MOGDI) కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్ దగ్గర
జయశంకర్ భూపాలపల్లి: కేసీఆర్ (KCR), మోదీలది (MODI) కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్ దగ్గర కార్మికుల సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఆనాటి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ (TSRTC), విద్యుత్ శాఖ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైంది. సకల జనుల సమ్మెకు సైరన్ ఊది కార్మికులు నడుం బిగించాకే తెలంగాణ రాష్ట్రం (Telangana) వచ్చింది. బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత, ఆర్టీసి కార్మిక సంఘానికి హరీష్‌రావు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. కార్మిక సంఘాలను కూడా వారి కుటుంబమే గుత్తాధిపత్యం చేసి అధికారంలో కొనసాగుతున్నారు. సీఎం కూతురే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదు? వేలాది కోట్లు కొల్లగట్టడానికే తప్ప... కార్మికుల సమస్యలు తీర్చడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నించడం లేదు. ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ, బీఆర్‌ఎస్ అవిభక్త కవలల్లా కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు వేరుగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ నిర్ణయాలన్నింటికీ కేసీఆర్ సహకరించారు. ప్రజా వ్యతిరేకత చూసి భయంతో వేరుగా ఉన్నామని చూపే ప్రయత్నం చేస్తున్నారు. తాడిచర్ల మైన్‌ను కేసీఆర్ ఎవరికి అప్పగించారు? తాడిచర్ల మైన్‌లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత? ఒరిస్సాలో ఉన్న కోల్ మైన్‌ను ఆదానికి అమ్మేస్తే... దానిపై కాంగ్రెస్ ఎంపీలం కొట్లాడాం. అందుకే నైని కోల్ మైన్ అమ్మకం ఆగిపోయింది. ప్రతిమా శ్రీనివాస్‌కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఈ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా? శ్రీధర్‌ను సీఎండీగా కొనసాగించడం వెనక కేసీఆర్‌కు (KCR) ఉన్న ఉపయోగం ఏమిటో ఆలోచించండి. లాభాల్లో ఉన్న సింగరేణిని దివాళా తీయించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రయత్నిస్తున్నారు.’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ఇది కూడా చదవండి: Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!